![]() |
![]() |
.webp)
శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమోలో కమెడియన్ బాబు మోహన్ అన్న మాటలు వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్ ఎపిసోడ్ "ఆ రోజులు మళ్ళీ రావు " పేరుతో రాబోతోంది. ఇక రాగానే ఆది , రాంప్రసాద్ "రాష్ట్రంలో గ్యాస్ ప్రోబ్లం వల్ల మెడికల్ షాపులు ఫుల్ బిజీ " అంటూ వార్తలు చదివారు. "గ్యాస్ ప్రాబ్లమ్ వల్ల మెడికల్ షాపులు ఎందుకు బిజీ " అన్నాడు ఆది. "వంట గ్యాస్ కాదు ఒంట్లో గ్యాస్ వల్ల " అన్నాడు రాంప్రసాద్. "సిల్క్ స్మిత గారితో మీరు చాలా సాంగ్స్ చేశారు కదా గురువు గారు. ఆవిడతో మీకున్న అనుబంధం గురించి " అని ఆది బాబు మోహన్ ని అడిగాడు.
"ఒకరోజు నేను షాట్ నుంచి వెళ్లిపోతుంటే ఆమె కూర్చుని ఉంది వచ్చి. ఏంటి నువ్వొచ్చావ్ నీకు షాట్ లేదు కదా అన్నాను. నేను నీ కోసం వచ్చాను అంది. నా కోసం వచ్చావా ఏంటి అని అడిగా. ఈరోజు నీ బర్త్ డే అంట కదా. అందుకే వచ్చాను అని చెప్పింది" అంటూ బాబు మోహన్ చాల ఆనందంగా చెప్పారు. ఇక ఇందులో చిన్నప్పుడు ఎవరెవరు ఎం ఆదుకున్నారు ఎం తాగారో అవన్నీ పెట్టారు. బొంగరం, గోళీలు, సోడాలు, పోస్ట్ డబ్బా, ముంజెలు, మామిడి ముక్కలు కారం, తాటాకులు, కర్రా బిళ్ళ, స్కిప్పింగ్ రోప్, ఇవన్నీ చూపించారు. ఇక తర్వాత నా ఆటోగ్రాఫ్ నుంచి "గుర్తుకొస్తున్నాయి " సాంగ్ కి కొంతమంది డాన్స్ చేశారు.
"చిన్నతనం గుర్తురాని వాడు అసలు మనిషే కాదు " ఆయన తన చిన్నతనాన్ని గుర్తు చేసుకుని ఏడ్చేశారు. "నేను బతికే ఉన్నన్నా అనే ఫీలింగ్ వచ్చింది. ఈ ఎపిసోడ్ నా చిన్నతనం మొత్తాన్ని గుర్తు చేసింది. నా జన్మ ధన్యం ఇప్పటిదాకా బతికుండడం. ఈ ఎపిసోడ్ కోసమే బతికున్నానేమో " అన్నారు బాబు మోహన్..
![]() |
![]() |